లక్షలు వసూలు చేశారు..ఉద్యోగాలు ఇవ్వలేదు..

Thu,October 12, 2017 09:24 PM

Fraud With the name of jobs in aviation sector


హైదరాబాద్ : విమానయాన రంగం (ఏవియేషన్ సెక్టార్)లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ సంస్థ విద్యార్థులను మోసం చేసింది. విశాఖలోని ద్వారకానగర్‌లో ఎయిమ్‌ ఫిల్‌ పేరుతో కార్యాలయం తెరిచిన ఓ సంస్థ ఆకర్షణీయ వేతనాలతో కూడిన ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి..విద్యార్థుల నుంచి లక్షల్లో డబ్బుల వసూలు చేసి, వారికి కుచ్చుటోపీ పెట్టింది. దీంతో బాధిత విద్యార్థులంతా ఎయిమ్ ఫిల్ ఆఫీస్ వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఉద్యోగం వస్తుందన్న నమ్మకంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకువచ్చి సదరు సంస్థకు డబ్బు కట్టామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎలాగైనా న్యాయం జరిగేలా చూడాలని విద్యార్తులు వేడుకుంటున్నారు.

1339
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles