బయోడీజిల్‌ డీలర్‌షిప్‌ పేరుతో భారీ మోసం..

Tue,May 28, 2019 09:26 PM

fraud with bio diesel dealership name 2 arrested


హైదరాబాద్ : బయోడీజిల్‌ డీలర్‌షిప్‌ పేరుతో ఘరానా మోసం వెలుగుచూసింది. మై ఓన్‌ ఎకో ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ పేరుతో మోసానికి పాల్పడిన ఎండీ సంతోష్ వర్మ, సారికా షిండేను సీసీఎస్ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. బయో డీజిల్ డీలర్ షిప్ ఇప్పిస్తామంటూ సంతోష్ వర్మ, సారికా షిండే ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఒక్కొక్కరి నుంచి రూ.15 లక్షలు వసూలు చేసి..ఆ తర్వాత బోర్డు తిప్పేశారు. నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం అక్కినపల్లి గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి అనే బాధితుడు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. సంస్థ ఎండీ సంతోష్ వర్మ, సారికా షిండేలను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు మొత్తం 9 రాష్ట్రాల్లో 500 మంది నుంచి రూ.100 కోట్లు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

793
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles