బంగారు కడ్డీ అంటూ ఎర...

Thu,April 18, 2019 10:04 PM

జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇద్దరు మాయ లేడీలు ఓ వృద్దురాలికి మాయమాటలు చెప్పి రెండున్నర తులాల పుస్తెల తాడును కాజేసిన ఘటన జరిగింది. బాధితురాలు, జగిత్యాల పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్న కోండ్ర నర్సవ్వ అనే వృద్దురాలు జిల్లా కేంద్రంలోని వాణీనగర్‌లో ఉంటున్న తన చెల్లెలు ఇంటికి వెల్లింది. నటరాజ్ టాకీస్ నుండి కొత్త బస్టాండ్ వద్దకు వెల్తుండగా మార్గమద్యంలో ఇద్దరు మహిళలు నర్సవ్వ దగ్గరకు వచ్చి మాకు పర్సు దొరికింది. పర్సులు వంద రూపాయల నోటు బంగారు కడ్డీ ఉంది. పర్సు నీదేనా అని సదరు మాయలేడీలు వృద్దురాలిని మాటల్లో దించారు.


పర్సులో దొరికిన బంగారాన్ని బంగారం దుకాణంలో తూకం వేసి చెరిసంగం పంచుకుందామని, నమ్మకం లేకుంటే దొరికిన బంగారాన్ని నీకు ఇస్తాము...మెడలోని పుస్తెల తాడును మాకు ఇవ్వు, దుకాణంలోకి వెల్లిన తర్వాత పుస్తెల తాడును ఇస్తాము, బంగారాన్ని పంచుకుందామని సదరు మహిళలు వృద్దురాలిని ఒప్పించారు. మాయలేడీలు చెప్పినట్లుగానే నమ్మిన వృద్దురాలు మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడును వారికి ఇచ్చి, బంగారు కడ్డీని తీసుకుంది. పుస్తెల తాడు చేతిలో పడ్డ తర్వాత నర్సవ్వను బురిడీ కొట్టించి అక్కడి నుండి జారుకున్నారు. మాయలేడీలు అక్కడి నుండి మాయం కావడంతో వారికోసం నర్సవ్వ గాలించింది. మోసపోయానని గ్రహించిన వృద్దురాలు జగిత్యాల పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు నర్సవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్పాప్తు చేస్తున్నట్లు జగిత్యాల టౌన్ పోలీసులు తెలిపారు.

2000
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles