ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాల పేరుతో మోసం

Tue,March 19, 2019 05:40 PM

Fraud in the name of nizamabad govt hospital

నిజామాబాద్: ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాల పేరుతో చోటుచేసుకున్న మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. సతీష్ అనే వ్యక్తి నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగం పేరుతో ఒక్కొ వ్యక్తి నుంచి రూ. 20 వేల నుంచి రూ. 50 వేల చొప్పున వసూలు చేశాడు. ఇలా పలువురు నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నారు. అనుమానం వచ్చి ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు విచారణ చేపట్టారు. దీంతో మొత్తం 24 మంది అనధికారికంగా పనిచేస్తున్నట్లు రిజిస్టర్‌లో నమోదైనట్లు తెలిపారు. దీంతో బాధితులు తామంతా మోసపోయామని గుర్తించి లబోదిబోమంటున్నారు.

1455
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles