ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ టోకరా

Wed,September 13, 2017 09:57 PM

Fraud in the name of job offers

హైదరాబాద్: నిరుద్యోగుల ఆశలను ఆసరా చేసుకొని ఓ కన్సెల్టెన్సీ సంస్థ వారిని నిండా ముంచింది. సింగపూర్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చెప్పి అందినకాడికి దోచుకొని చేతులెత్తేసింది. ఈ సంఘటన నగరంలోని లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ కరణ్‌కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. తార్నాకలోని రైల్వే డిగ్రీ కళాశాల ఎదురుగా మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన డేవిడ్, మోజేస్‌లు అరోన్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ సంస్థను ఏర్పాటు చేశారు. అదే సంస్థలో గత రెండు నెలలుగా ఈనా అనే యువతి హెచ్‌ఆర్‌గా చేరి విధులు నిర్వర్తిస్తుంది. సింగాపూర్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్రచారం చేసుకొని ఒక్కో ఉద్యోగానికి రూ. లక్ష రూపాయాలు ఖర్చు అవుతుందని నమ్మబలికారు. దీంతో సుమారు 25 మంది నిరుద్యోగ భాదితులు ఒక్కొక్కరి నుండి రూ. 30 నుండి 40 వేల వరకు వసూలు చేసి రూ.20 స్టాంప్ పేపర్‌పై ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా బుధవారం ఇంటర్వూలు ఉన్నాయంటూ భాదితులకు ఫోన్ ద్వారా మేస్సేజ్ రూపంలో సందేశాలు పంపారు. ఉద్యోగాలు వస్తాయని ఆశతో వచ్చిన భాదితులకు తీరా సంస్థలో ఎవరూ లేకపోవడంతో మోసం జరిగిందని గ్రహించారు. జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిర్వాహాకులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

946
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles