పేదలకు ఇళ్లు పేరుతో మోసం.. నలుగురు అరెస్ట్‌

Sat,May 25, 2019 03:42 PM

fraud in the name of house for poor in yadadri bhuvanagiri district

యాదాద్రి భువనగిరి: పేదలకు ఇళ్లు కట్టి ఇస్తామని మోసానికి పాల్పడిన మాల్యవి కరుణోదయ సొసైటీకి చెందిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ క్యాంప్‌ కార్యాలయంలో డీసీపీ నారాయణరెడ్డి మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. సంస్థ ప్రతినిధులు మొదట రూ.30 వేలు చెల్లిస్తే ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పి డబ్బు వసూలు చేశారు. 2700 మంది బాధితుల నుంచి రూ. 8.1 కోట్లు వసూలు చేశారు. డబ్బు వసూలుచేసి ఇళ్లు నిర్మించక పోవటంతో ఆలేరులో బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితురాలు రమాదేవి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్‌వోటీ, ఆలేరు పోలీసులు కర్మాన్‌ఘాట్‌లోని ఆఫీసులో నలుగురిని అరెస్ట్‌ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 12.22 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

1399
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles