మహిళలపై దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి

Sun,March 24, 2019 07:19 AM

సూర్యాపేట: జిల్లాలోని గరిడేపల్లి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చామకూరి అనిల్ అనే వ్యక్తి ఇంట్లో దేవుని పండుగ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇంట్లోని వ్యక్తులు పుట్ట బంగారం తీసుకువచ్చేందుకు సమీప ప్రాంతానికి మేళాతాళాలతో ఈ తెల్లవారుజామున 2 గంటలకు వెళ్లారు. పుట్ట బంగారం తీసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా మిర్యాలగూడ నుంచి కోదాడ వైపుగా వెళ్తున్న లోడ్ లారీ అదుపుతప్పి ఒక్కసారిగా వీరిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మర్రి ధనమ్మ, వెంకమ్మ, మట్టమ్మలతో పాటు 19 ఏండ్ల యువతి మృతిచెందింది. మహిళల మృతితో తీవ్ర విషాదం నెలకొంది. లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

4379
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles