ఖాళీగా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు

Sun,May 5, 2019 05:47 AM

four mlc seats are vacant in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నాలుగు శాసనమండలి స్థానాల ఎన్నికకు ఒకటి రెండ్రోజుల్లో నోటిఫికేషన్ విడుదలకానుంది. శాసనసభకు ఎన్నికైన పట్నం నరేందర్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామాచేశారు. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కొండా మురళి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీరిలో నరేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి, మురళి స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి ఎన్నికయ్యారు. మైనంపల్లి హన్మంతరావు ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యారు. ప్రస్తుతం శాసనమండలిలో 33 మంది సభ్యులున్నారు. ఈ నలుగురి ఎన్నికకు త్వరలో నోటిఫికేషన్ విడుదలకానుంది. మరో ముగ్గురు రాములునాయక్, భూపతిరెడ్డి, కే యాదవరెడ్డిలపై పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో అనర్హతవేటు పడగా వారు కోర్టుకు వెళ్లారు. ఆ కోర్టు కేసు కూడా వచ్చేవారం తిరిగి విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో కోర్టు కేసు పూర్తికాగానే వారికి సంబంధించిన ఎన్నిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందని సమాచారం. ఖాళీ అయ్యేస్థానాల్లో ఇద్దరు అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి, నవీన్‌కుమార్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా లోక్‌సభ ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి ప్రకటించారు.

999
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles