మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు అరెస్ట్

Thu,October 11, 2018 06:31 PM

Four Maoist party members arrested

భూపాలపల్లి: వెంకటాపురం మండలం యకన్నగూడెం అడవి ప్రాంతంలో పోలీసుల వాహన తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో మావోయిస్టు పార్టీ రైతు సంఘం సెక్రెటరీతో పాటు ప్లాటున్ డిప్యూటీ కమాండర్, మిలీషియా కమాండర్, మిలీషియా సభ్యుడు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద మావోయిస్టు పార్టీ సామగ్రి లభ్య మైంది. వీరు వెంకటాపురం మండలంలోని పలు చోట్ల బాంబులు అమర్చడం, పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ఒకరిని కాల్చిన సంఘటనతో పాటు బీఎస్ఎన్ఎల్ టవర్ పేల్చివేతలో కీలక సూత్ర దారులు. వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు ఓఎస్డీ సురేష్ కుమార్ వెల్లడించారు.

2237
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS