ఆర్టీసీ బస్సు - కారు ఢీకొని నలుగురు మృతి

Tue,July 23, 2019 09:56 PM

four killed in road accident

చిత్తూరు: జిల్లాలోని కణంమెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సు - కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నగరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు తమిళనాడు వాసులుగా గుర్తించారు. తిరుమల నుంచి చెన్నై వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

435
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles