
సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లాలో రాజీవ్ రహదారిపై తాజాగా ప్రమాదం చోటుచేసుకుంది. గజ్వేల్ మండలం రిమ్మనగూడ సమీపంలో రహదారిపై ఆగి ఉన్న టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. టాటా ఏస్‌ను వెనక నుంచి లారీ వేగంగా ఢీకొట్టడంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు వర్గల్ మండలం పాములపర్తి వాసులుగు గుర్తించారు. ఆటో 20 మంది ఉన్నారు. చేర్యాల మండలంలో అంత్యక్రియలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు బాధితులు పేర్కొన్నారు. 
