ముగ్గురు అంతరాష్ట్ర చైన్ స్నాచర్లు అరెస్ట్

Thu,January 18, 2018 03:29 PM

Four Interstate Chain Snatchers Arrested

భద్రాద్రికొత్తగూడెం : జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లో చైన్ స్నాచింగ్ కేసులో నలుగురు నిందితులను ఈరోజు మీడియా ముందు ప్రవేశ పెట్టారు. కార్యక్రమంలో సీఐ సంపత్ కుమార్, ఎస్సై ఈళ్ళ రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ సంపత్ కుమార్ నిందితుల వివరాలు వెల్లడించారు. వీరు ముగ్గురుకి విజయవాడ జైలులో పరిచయం ఏర్పడింది వీరు జల్సాలకు అలవాటు పడి ఇలాంటి నేరాలకు పాల్పడ్డారు. ఇదే క్రమంలో వీళ్ళు గుండెపుడి గ్రామంలో ఒక మహిళ మెడలో పుస్తెల తాడుతెంపుకొనీ పారిపోతుండగా జూలూరుపాడు చంద్రుగొండ పోలీసులు వెంబడించి పట్టుకోవడం జరిగిందని తెలియజేశారు. నిందితులు దొంగిలించిన సొమ్మును రికవరీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. నిందితులు ఏ 1 పాతర్లపల్లి నాగదుర్గ ప్రసాద్(24) రాణిగారితోట విజయవాడ, ఏ2. కనకరాజుల మధు(23) దిరిసినచర్ల గ్రామం నేరేడచర్ల మండలం, సూర్యాపేట జిల్లా, ఏ3 రాయల భార్గవ్(28) కృష్ణజిల్లా పేర్లు రాజుపేట తిరువూరు అని చెప్పారు.

670
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles