షార్ట్ సర్క్యూట్..నాలుగు ఇండ్లు దగ్ధం

Sun,August 18, 2019 10:27 PM

Four houses gutted due to shortcircuit in adilabad

ఆదిలాబాద్ అర్బన్ : ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో నాలుగు ఇండ్లు దగ్ధం అయ్యాయి. ఈ ఘటనలో రూ.8 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళితే..మావల మండల కేంద్రంలోని జక్కుల సురేందర్, ఆనంద్, మహబూబా, కిష్టు ఇండ్లు ఒక వరుస క్రమంలో ఉన్నాయి. మహబూబా మినహా మిగతా వారు రోజు వారీగా పొలం పనులకు కూలికి వెళ్లారు.

ఇదే క్రమంలో బక్రీద్ పండుగ సందర్భంగా మహబూబా ప్రార్థన చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపేందుకు సమీప బంధువుల ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఒక ఇంట్లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మంటలు మరో మూడు ఇండ్లకు వ్యాపించాయి. మంటలు ఎగిసి పడడంతో గమనించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఆ వెంటనే 101కు సమాచారం ఇవ్వగా..హుటాహుటిన ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో బట్టలు, నిత్యావసర వస్తువులతోపాటు నగదు కాలిబూడిదయ్యాయి.

ఈ అగ్నిప్రమాదంతో 4 కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న వెంటనే ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీటీసీ నల్లవనితా, స్థానిక సర్పంచ్ దొగ్గలి ప్రమీల బాధిత కుటుంబాలను పరామర్శించారు. అధైర్యపడవద్దని, అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే జోగురామన్న బాధితులకు భరోసానిచ్చారు.

480
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles