ఒకే కాన్పులో నలుగురు ఆడబిడ్డలు జననం

Mon,April 16, 2018 05:49 PM

Four girl infants born in single delivery in Nizamabad govt hospital

నిజామాబాద్: ఒకే కాన్పులో నలుగురు ఆడబిడ్డలు జన్మించిన ఘటన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్నది. కామారెడ్డి జిల్లా హజీపూర్ తండాకు చెందిన శోభ అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతూ.. నిజామాబాద్ ఆసుపత్రికి వచ్చింది. దీంతో ఆమెకు వైద్యులు డెలివరీ చేశారు. ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు శోభ జన్మనిచ్చింది. అయితే.. నలుగురు పిల్లల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నలుగురిలో ముగ్గురు పిల్లలు తక్కువ బరువుతో జన్మించడంతో మెరుగైన చికిత్స కోసం వాళ్లను నిలోఫర్ ఆసుపత్రికి తరలించనున్నట్లు వైద్యులు తెలిపారు. 24 వారాల్లోనే డెలివరీ కావడంతో శిశువులు తక్కువ బరువుతో జన్మించారని.. తల్లి పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

5534
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS