లారీని ఢీకొన్న కారు: నలుగురు మృతి

Fri,June 22, 2018 06:27 AM

four died in road accident on rajiv rahadari

పెద్దపల్లి: జిల్లాలోని సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు మృతులు పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన వారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వివరాలు చదువాల అరుణ్ కుమార్ (37) సౌమ్య (30) అకిలేష్ (10) శాన్వి (8). అరుణ్ కుమార్ మంథనిలో ఓ ప్రైవేట్ పాఠశాల నిర్వహకుడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
3511
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS