టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నాలుగు చార్జిషీట్లు దాఖలు

Tue,May 14, 2019 01:28 PM

Four chargesheets filed in Tollywood Drugs case

హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నాలుగు చార్జిషీట్లు దాఖలు చేసినట్లు ఎక్సైజ్‌శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 12 కేసుల్లో ఇప్పటి వరకు 4 కేసుల్లో ఛార్జిషీట్ దాఖలు చేసిన సిట్ మరో 8 కేసుల్లో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. సమాచారం హక్కు చట్టం కింద ఫోరం ఫర్ గుడ్‌గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభ రెడ్డి టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ వివరాలు కోరారు. దీనిపై స్పందించిన ఎక్సైజ్‌శాఖ సంబంధిత సమాచారాన్ని తెలియజేసింది. కేసు దర్యాప్తు సందర్భంగా మొత్తం 62 మంది నటీ, నటులు, దర్శకులు, సినీ పరిశ్రమలోని ప్రముఖులను విచారించినట్లు వెల్లడించారు. వీరి వద్ద నుంచి గోర్లు, వెంట్రుకల నమూనాలను సేకరించినట్లుగా పేర్కొన్నారు. ఇప్పటి వరకు నాలుగు చార్జిషీట్లు దాఖలయ్యాయని పేర్కొంది. డ్రగ్స్ కేసు వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లు, జూనియర్ ఆర్టిస్టులు, టెక్నిషియన్లను అధికారులు విచారించారు.

1371
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles