సబ్‌స్టేషన్లు, రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

Wed,May 10, 2017 02:59 PM

foundation stone to substations and roads in Patancheru

సంగారెడ్డి : జిల్లాలోని పటాన్‌చెరు నియోజకవర్గంలో సబ్‌స్టేషన్లు, రోడ్ల నిర్మాణ పనులకు నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. పటాన్‌చెరు, రామచంద్రాపురం, బొల్లారంలో 5 విద్యుత్ సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేశామని తెలిపారు. పటాన్‌చెరుకు 132 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు చేస్తున్నామని చెప్పారు. మెదక్ జిల్లాలో విద్యుత్ పంపిణీ మెరుగుపర్చడానికి ఇప్పటి వరకు రూ. 1438 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని హామీనిచ్చారు. పటాన్‌చెరులో విద్యుత్ డీఈ ఆఫీస్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

716
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles