మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే ఎర్రబెల్లి

Mon,April 30, 2018 09:06 PM

foundation stone lays to Muslim Community Hall by MLA Errabelli

జనగామ : ముస్లిం, మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం జనగామ జిల్లా పాలకుర్తిలో రూ.5 లక్షలతో నిర్మించే ముస్లిం కమ్యూనిటీ హాలుకు ఎర్రబెల్లి దయాకర్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అల్లా దయతో ప్రజలంతా ఆనందంగా ఉండాలని కోరారు. సీఎం కేసీఆర్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తున్నారని, వారికి కావాల్సిన కనీస వసతులపై చర్యలు తీసుకున్నారని తెలిపారు.

విద్యలో ప్రాధాన్యమిచ్చేందుకు ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారని, ఇందులో భాగంగానే నియోజక వర్గంలోని తొర్రూరులో ఏర్పాటు చేశారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నల్లా నాగిరెడ్డి, ఎంపీపీ భూక్య దల్జీత్‌కౌర్, సర్పంచ్ ఆంగిడి ఆంజమ్మ, ఎంపీటీసీ కమ్మగాని విజయ నాగన్న, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ అఫ్రోజ్, ఎండీ వహీద్, ఇమామ్ పాల్గొన్నారు.

1280
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles