మాజీ సర్పంచ్‌కు పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం

Wed,December 19, 2018 01:46 PM

Former Sarpanch Vanaja clears Panchayt Secretary test

సంగారెడ్డి : ఆమె ఐదేళ్లు సర్పంచిగా పని చేసిన అనుభవం.. పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం రావడానికి మరింత సులువు చేసింది. తాను సర్పంచ్‌గా ఏ విధులు నిర్వహించిందో.. ముందే తెలుసు కాబట్టి పరీక్షలో అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం సరిగ్గా రాసి జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాన్ని సాధించింది. సంగారెడ్డి జిల్లా కాల్‌బగూర్ గ్రామానికి చెందిన తలేల్మ వనజ(32) ఇటీవల నిర్వహించిన పంచాయతీ సెక్రటరీ రాత పరీక్ష రాసింది. నిన్న విడుదలైన ఆ రాతపరీక్ష ఫలితాల్లో తన పేరు ఉంది.

ఈ సందర్భంగా వనజ మాట్లాడుతూ.. 2013 నుంచి 2018 వరకు కాల్‌బగూర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పని చేశాను. ఆ పదవీ అనుభవంతో సర్పంచ్, వార్డు సభ్యుల విధులు, బాధ్యతలు, గ్రామ కమిటీల విధివిధానాలు ముందే తెలుసుకాబట్టి రెండో పేపర్‌ను బాగా రాశాను. డీఎస్సీ, హాస్టల్ వెల్ఫేర్ వార్డెన్ ఎగ్జామ్స్ కూడా రాశాను. ఈ రెండింటి కోసం జనరల్ స్టడీస్ చదివాను. మొత్తంగా పంచాయతీ సెక్రటరీ పరీక్ష బాగా రాసి విజయం సాధించాను. డీఎస్సీ, వార్డెన్ ఉద్యోగాలు కూడా వస్తాయనే నమ్మకం ఉంది. బీఎస్సీ, బీఎడ్ చదివాను. నా భర్త ఇదే గ్రామానికి చెందిన రైతు. నాకు ఇద్దరు పిల్లలు. పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం వచ్చినందుకు నన్ను గ్రామ ప్రజలు కొనియాడుతున్నారని, యువత ఆదర్శంగా తీసుకుంటున్నారని వనజ తెలిపారు.

8376
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles