తెలంగాణలో క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం...

Sat,January 12, 2019 06:24 PM

Former Minister Harish Rao has launched national level handball championships

సిద్దిపేట జిల్లా కేంద్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ స్థాయి హాండ్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలను మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సిద్దిపేట జాతీయ స్థాయి క్రీడలకు వేదిక కావడం, జాతీయ స్థాయి హాండ్ బాల్ పోటీలు జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కేసీఆర్ పద్నాలుగు ఏండ్లు కొట్లాడి తెలంగాణ సాదించిండు, దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న యంగెస్ట్.. స్టేట్ తెలంగాణ అని అన్నారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఏకైక రాష్ట్రం తెలంగాణ. కల్యాణ లక్ష్మీ, రైతు బీమా, రైతులకు ఏటా ఎకరాకు 10 వేల పెట్టుబడి లాంటి ఎన్నో పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు.

రైతులకు సాగునీటి వసతి కల్పిస్తున్నాం. ఎన్నో రాష్ట్రల నుంచి తెలంగాణ రాష్ట్రనికి ప్రజాప్రతినిధులు వచ్చారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించారు. సిద్దిపేట అభివృద్ధి లో ఆదర్శం.. సిద్దిపేట కోమటి చెరువు అందాలను వీక్షించండి.. బొట్లలో షికారు చేస్తూ రిలీఫ్ అవండి. మిమి ప్రాంతాల ఫుడ్ తో పాటు సిద్దిపేట స్పెషల్ లోకల్ ఫుడ్ టెస్ట్ చేయండని ఇతర రాష్ట్రాల క్రీడా కారులకు సూచించారు. వచ్చే ఐదు రోజుల పాటు మీలోని క్రీడా ప్రతిభను ప్రదర్శించి విజేతలుగా నిలవండి. ఈ క్రీడల్లో క్రీడాకారులు ఉత్తమ ప్రతభ కనబరిచి ఆసియన్, గేమ్స్, ఒలింపిక్ గేమ్స్ లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించి భారత కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని క్రీడాకారులను ఉత్తేజపరిచారు.. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడలను వీక్షించారు..ఈ సందర్భంగా హరీష్ రావుని సన్మానించారు.

952
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles