వ్యవసాయానికి, జ్యోతిష్యానికి పూర్వవైభవం: మంత్రి జగదీష్‌రెడ్డి

Tue,March 19, 2019 06:09 PM

former glory to Agriculture and Astrology says minister Guntakandla Jagadish reddy

నల్లగొండ: వ్యవసాయం, జ్యోతిష్యశాస్త్రం ప్రకృతికి అనుకూలంగా నడిచే అంశాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. అయితే ఒక దశలో అటు అర్చకత్వం ఇటు వ్యవసాయం అని చెప్పుకునేందుకు నామూషి పడ్డ సందర్భాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం సీఎం కేసీఆర్ పాలనలో దండగ అనుకున్న వ్యవసాయం పండుగ అయిందని.. అదే దశ ఇప్పుడు అర్చకత్వానికి, జ్యోతిష్యశాస్ర్తానికి సైతం వచ్చిందని మంత్రి తెలిపారు. వైదిక బ్రాహ్మణ సంఘం, తెలంగాణ దేవాలయాల అర్చక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన శ్రీ వికారి నామ సంవత్సర పంచాగాన్ని ఆయన మంగళవారం సాయంత్రం నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీ.ఆర్.ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు చివరి అంచు వరకు చేరే విధంగా ప్రణాళికలు రూపొందించి అమలు పరిచిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని కొనియాడారు. కొంతకాలం పాశ్యాత్య దేశాలను అనుసరించి ఆగమైపోతున్న తరుణంలో మళ్లా అర్గానిక్స్ అంటూ మన పంటలు మనం పండించుకునే పరిస్థితులు ఏర్పడటం శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు.

1768
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles