అక్రమంగా జామాయిల్ కర్రను తరలిస్తున్న లారీలు సీజ్

Sat,June 15, 2019 09:17 PM

forest officials seized jamail wood in bhadradri kothagudem dist

భద్రాద్రి కొత్తగూడెం: అక్రమంగా జామాయిల్ కర్రను తరలిస్తున్న రెండు లారీలను ముందస్తు సమాచారంతో ఫారెస్టు విజిలెన్స్ అధికారులు ఇవాళ పట్టుకున్నారు. పట్టుకున్న రెండు లారీలను సీజ్ చేసి పాల్వంచ ఫారెస్టు కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఫారెస్ట్ విజిలెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ములకలపల్లి మండలం మాదారం పంచాయతీ పరిధిలోని సత్యంపేట గ్రామంలో 1977లో మూడెకరాల భూమిలో వీఎస్‌ఎస్ ఫారెస్టు శాఖ ఆధ్వర్యంలో జామాయిల్ తోటను సాగు చేస్తున్నారు. అయితే ఈ భూముల్లో సీతారామా ప్రాజెక్టు కాలువ నిర్మాణ పనులు జరుగుతుండటంతో గత కొన్ని రోజుల క్రితం ఈ జామాయిల్ తోటను సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లకు పనులను అప్పగించి జామాయిల్ తోట నరికివేతకు ఆదేశించారు.

ఇందులో భాగంగా గత కొన్ని రోజుల క్రితం జామాయిల్ తోటను నరికించారు. అయితే సంబంధిత కాంట్రాక్టర్, ఫారెస్టు సిబ్బంది, అదే గ్రామానికి చెందిన గిరిజన మహిళ మడివి నాగమ్మ పేరు మీద తప్పుడు సర్వే నంబర్ 123/260లో సొంత భూమిగా చూపిస్తూ జామాయిల్ తోటను నరికించారు. జామాయిల్ కర్రలను గత రెండ్రోజులుగా లారీల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు ఫారెస్టు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. ఈ సమాచారం మేరకు హైదరాబాద్ ఫారెస్టు ఎఫ్‌డీవో రాజశేఖర్ పాల్వంచలోని లారీ కాంటాల వద్ద రెండు లారీలను పట్టుకొని ఫారెస్టు కార్యాలయానికి తరలించారు.

1889
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles