కాటవరంలో విదేశీ బృందం పర్యటన

Sat,October 19, 2019 09:56 PM

అడ్డాకుల : స్వచ్ఛ భారత్‌లో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైన మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని కాటవరం గ్రామాన్ని శనివారం 18 దేశాలకు చెందిన ప్రతినిధుల బృందం సందర్శించింది. వారికి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డితో కలిసి గ్రామస్తులు బతుకమ్మలతో స్వాగతం పలికారు. అనంతరం విదేశీ బృందం గ్రామంలోని కాలనీల్లో తిరిగి ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. భూగర్భజలాలు పెరిగేందుకు చేపట్టిన పనులతోపాటు, దోమలబారి నుంచి రక్షించుకోవడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారని గ్రామ సర్పంచ్, గ్రామ మంచాయతీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో యువకులు, మహిళలు చేపడుతున్న కార్యక్రమాలను తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు.

368
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles