కలుషిత ఆహారం తిని 80 మందికి అస్వస్థత

Tue,November 27, 2018 09:23 PM

food poison 80 students fall sick in khanapur

ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో ఉన్న గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆహారం కలుషితం కావడంతో 80 మంది విద్యార్థినులు కడుపునొప్పితో దవాఖానలో చేరారు. దీనికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. మధ్యాహ్న భోజనం చేసిన బాలికలకు రెండు గంటల తర్వాత తీవ్రమైన కడుపునొప్పి రావడంతో పాఠశాల సిబ్బంది వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స చేయించారు.

ఈ విషయం తెలుసుకున్న ఖానాపూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రచారం నుంచి దవాఖానకు వచ్చి బాలికలను పరామర్శించారు. జరిగిన ఘటనను గురించి బాలికలను అడిగి తెలుసుకున్నారు. బాలికలకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. జిల్లా వైద్యాధికారి జలపతినాయక్, డీటీడీవో శ్రీనివాసరెడ్డి ఖానాపూర్‌కు వచ్చారు. బాలికలకు ప్రమాదమేమీ లేదని జిల్లా వైద్యాధికారి జలపతినాయక్ తెలిపారు. ఆహారం కలుషితం కావడంపై విచారణ జరిపేందుకు డీటీడీవో శ్రీనివాసరెడ్డి ఖానాపూర్ సుభాష్‌నగర్‌లో ఉన్న బాలికల ఆశ్రమ పాఠశాలకు వెళ్లారు. ఇది ఆశ్రమ సిబ్బంది నిర్లక్ష్యంతోనే జరిగిందని, జరిగిన ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని బాలికల తల్లిదండ్రులు ఉన్నతాధికారులను కోరారు.

1054
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles