కేబీఆర్ పార్కు వద్ద ఫ్లైఓవర్లు తప్పనిసరి!

Mon,June 6, 2016 06:58 AM

flyovers must at KBR park

కేబీఆర్ పార్కు వద్ద మల్టీలెవల్ ఫ్లైఓవర్లు నిర్మాణం వల్ల అనేక ప్రయోజనాలున్నట్లు అధికారులు వెల్లడిం చారు. కాలుష్యాన్ని తగ్గించుకోవడమే కాకుండా భారీగా ఇంధనాన్ని కూడా ఆదాచేయవచ్చని వారు తెలిపారు. వీటిని నిర్మించకుంటే వచ్చే రెండు దశాబ్ధాలలో కాలుష్యం 456.19టన్నులకు పెరుగుతుందని వారు తెలిపారు.
ఎస్‌ఆర్‌డీపీ వల్ల కెబిఆర్ పార్కువద్ద కలిగే ప్రయోజనాలు
* 2015-2035నాటికి వాహనాల సంఖ్య 2.5లక్షలనుంచి
5.5 లక్షలకు పెరుగుతుంది
* 2015నాటికి కాలుష్యం శాతం(సీఓ2)- 107.92టన్నులు
* ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు చేపట్టకపోతే 2035నాటికి కాలుష్యం శాతం(సీఓ2)- 456.19టన్నులకు పెరుగుతుంది
* ఎస్‌ఆర్‌డీపీ చేపట్టి ఫ్లైఓవర్లు పూర్తిచేస్తే కాలుష్యం శాతం(సీఓ2)- 121.01టన్నులకు తగ్గుతుంది
* అంటే ఎస్‌ఆర్‌డీపీ నిర్మాణం వల్ల తగ్గే కాలుష్యం- 335.18టన్నులు(227శాతం)
* అంతేకాదు, ఎస్‌ఆర్‌డీపీ వచ్చే 20ఏళ్లలో 40.59కోట్ల
లీటర్ల ఇంధనం ఆదా అవుతుంది
* మొత్తం 20ఏళ్లలో తగ్గే కాలుష్యం(సీఓ2)-13.66లక్షల టన్నులు

2616
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS