రేపటిలోగా ఎస్సారెస్పీకి చేరనున్న 2 టీఎంసీల నీరు

Mon,June 11, 2018 02:42 PM

flood water flows to Sri Ramsagar project

నిజామాబాద్ : బాబ్లీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. 2 గేట్ల ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి విడుదల చేశారు. రేపటిలోగా ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు 2 టీఎంసీల నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో బాబ్లీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జోగులాంబ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు కూడా వరద పోటెత్తింది. ప్రాజెక్టులకు జలకళ వస్తుండడంతో రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

3907
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles