రాష్ట్ర జలాశయాలకు కొనసాగుతున్న వరద ప్రవాహాలు

Sat,August 18, 2018 06:24 PM

Flood water flow continues to the state projects

హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో వరుసగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని జలాశయాలకు వరద ప్రవాహాలు కొనసాగుతున్నాయి. నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువన శ్రీశైలం నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,78,372 క్యూసెక్కులు వస్తుండగా.. ఔట్‌ఫ్లో 8,291 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 531.30 అడుగులుగా.. పూర్తిస్థాయి నీటినిల్వ 312.405 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటినిల్వ 170.697 టీఎంసీలుగా ఉంది. అదేవిధంగా శ్రీరాంపూర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 58 వేల క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1070.60 అడుగులుగా... జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 90.313 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటినిల్వ 30.147 టీఎంసీలుగా ఉంది.

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది. జలాశయానికి 3,40,550 క్యూసెక్కులు వస్తుండగా ఔట్‌ఫ్లో 2,64,285 క్యూసెక్కులుగా ఉంది. అధికారులు ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఒక్కో గేటును 10 అడుగుల మేర ఎత్తివేత. స్పిల్‌వే ద్వారా 1,59,912 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 881.9 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటినిల్వ 198.36 టీఎంసీలుగా ఉంది.

6136
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles