గంప కింద చిన్నారి మృతదేహం లభ్యం

Sun,February 28, 2016 11:42 AM

five years child murdered

కరీంనగర్: జిల్లాలోని కాటారం మండలం దామరకుంటలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారి వినయశ్రీని హతమార్చి గంప కింద దాచిన విషాద సంఘటన చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వివరాలు.. హోంగార్డు రాజస్వామి కుమార్తె వినశ్రీ నిన్న సాయంత్రం నుంచి కనిపించడంలేదు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. రాజస్వామి ఇంటి పక్కనే ఉన్న వెంకటస్వామి ఇంట్లో గంప కింద చిన్నారి వినయశ్రీ మృతదేహం లభ్యమైంది. అయితే వెంకటస్వామి నిన్న సాయంత్రం నుంచి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయినట్టు గుర్తించారు. వెంకటస్వామి, రాజస్వామికి మధ్య విభేదాలున్నాయి. ఈ కారణంగా వెంకటస్వామిని రాజస్వామి కుటుంబీకులు అనుమానించారు. వెంకటస్వామి ఇంట్లో వెతకగా గంప కింద చిన్నారి మృతదేహం కనిపించింది.

1137
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles