ఆరోగ్యానికి ఐదు సూత్రాలు

Sun,December 16, 2018 06:53 AM

Five principles for health

హైదరాబాద్ : ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఐదు సూత్రాలు పాటించాలని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) సూచించింది. ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది. మై ప్లేట్ ఫర్‌ది డే పేరుతో రోజువారీ ఆహారంలో ఏమి తీసుకోవాలో తెలియచేస్తూ బ్రోచర్లను విడుదల చేసింది. చేతులను సరైన పద్ధతిలో శుభ్రపరుచుకోవాలని, ఆహారాన్ని నిల్వచేయడం-తిరిగి వాడుకోవడంలో జాగ్రత్త వహించాలని, తాగునీటిని సురక్షితంగా ఉంచుకోవాలని, వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పండ్లు, కూరగాయలను సురక్షితమైన నీటితో కడుగాలని పేర్కొంది.
మై ప్లేట్ ఫర్ ది డే..
రోజువారీ ఆహారంలో కాయలు, విత్తనాలు (నట్స్ అండ్ సీడ్స్), కొవ్వు పదార్థాలు, నూనెలు (ఫ్యాట్స్ ఆయిల్స్), పాలు/పెరుగు, పప్పుదినుసులు, పండ్లు, కూరగాయలను తగి న మోతాదులో తీసుకోవాల ని సూచిస్తూ మై ప్లేట్ ఫర్ ది డే బ్రోచర్‌ను విడుదలచేసింది. గుడ్లు, చేపలు, మాంసంతో సమానంగా పప్పుదినుసులు శక్తినందిస్తాయని ఎన్‌ఐఎన్ పేర్కొన్నది. ఆహారంలో కూరగాయలను మోతాదులో తీసుకోలేని పక్షంలో సలాడ్ రూపంలో తీసుకోవచ్చని, పండ్ల రసాలకు సాధ్యమైనంత దూరంగా ఉండి శుభ్రమైన పండ్లను తీసుకోవాలని, ఆహారంలో ఒకే రకమైన నూనెను వాడకుండా అన్ని రకాల వంట నూనెలను వాడాలని సూచించింది. ఇవన్నీ కలిపి ప్లేట్ ఫర్ ది డేలో రెండువేల కిలో క్యాలరీల శక్తి లభిస్తుందని ఎన్‌ఐఎన్ వివరించింది.

3083
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles