ఆటోను ఢీకొన్న లారీ: ఐదుగురు మృతి

Sun,April 14, 2019 03:53 PM

సూర్యపేట: జిల్లాలోని కోదాడలోని ఖమ్మం క్రాస్‌రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఆటోను ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తమ్మరలో శ్రీరామనవమి వేడుకలకు వెళ్లివస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

585
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles