ఎంపీటీసీ భర్త కిడ్నాప్ కేసులో ఐదుగురు అరెస్ట్

Fri,March 15, 2019 09:25 PM

Five arrested in MPTC husband kidnap case

సిరిసిల్ల : జిల్లాలో సంచలనం సృష్టించిన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట ఎంపీటీసీ భర్త పోకల అశోక్ కిడ్నాప్ కేసును పోలీసులు చాకచక్యంతో ఛేదించారు. సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు, కిడ్నాప్ చేసిన ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని, అరెస్ట్ చేశారు. నిందితులు హైదరాబాద్‌ కు చెందిన తిరుమలశెట్టి రమేశ్ (53), బోయినపల్లి మండలం కొదురుపాకకు చెందిన కత్తెరపాక పర్శరాం (32), కత్తెరపాక నరేశ్ (28), కత్తెరపాక బాలరాజు (40), సిరిసిల్ల మండలం పెద్దూరుకు చెందిన పెంట రంజిత్ (37) కోనరావుపేట మండలం మామిడిపల్లె గ్రామ శివారులో ఏపీ 15 బీఈ 5891 గల కారులో కిడ్నాపర్లు పట్టుబడ్డారు. కేసును చాకచక్యంగా ఛేదించిన వేములవాడ డీఎస్పీ వెంకటరమణ, సిరిసిల్ల రూరల్, వేములవాడ రూరల్ సీఐ, చందుర్తి సీఐలు అనీల్‌కుమార్, రఘుచందర్, విజయ్‌కుమార్‌తో పాటు ఎస్‌ఐలను ఎస్పీ రాహుల్ హెగ్డే అభినందించారు. వీరికి త్వరలోనే అవార్డు అందిస్తామన్నారు. నిందితులు సులువుగా డబ్బులు సంపాదించాలనే కిడ్నాప్ చేశారని ఎస్పీ పేర్కొన్నారు.

1400
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles