చేపలతో ఆరోగ్యం మీ సొంతం..

Mon,February 25, 2019 08:46 AM

Fish meat for Your Healthy Life


మనం తీసుకునే ఆహారంతోనే ఆరోగ్యం ముడిపడి ఉంది. మంచి ఆహారం ఆరోగ్యానికి సంకేతం. సమతుల ఆహారంపై నగర, పట్టణ ప్రజల్లో కొంతమేరకు చైతన్యం పెరిగినా పల్లెల్లో మాత్రం అంతంత మాత్రమే. స్థానికంగా పుష్కలంగా లభించే చేపలు, రొయ్యలను ఆహారంలో తీసుకుంటే పోషకాహార లోపం తగ్గి ఆరోగ్య సమస్యలు దరి చేరవని నిపుణులు సూచిస్తున్నారు.

తాజా చేపలతో ఆరోగ్యం


చేపలు, రొయ్యలు పోషక విలువలు ఉన్న బలవర్థక ఆహారం. మన దేశంలో లక్ష టన్నుల చేపల వినియోగం జరుగుతుండగా ఇందులో 60శాతం చేపలు సముద్రం నుంచే లభ్యమవుతున్నాయి. చేపల్లో చాలా రకాలున్నాయి.
ప్రతి మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి ఏటా కనీసం 11కిలోల చేపలు, రొయ్యలను తినాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. మాంసాహారులు సగటున ఏడాదికి 5కిలోలు కూడా తినటం లేదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో కూడా 5కిలోలు మించి ప్రజలు చేపలు వినియోగించడం లేదు. జిల్లాలో సుమారు 600కు పైగా చేపల చెరువులు ఉండగా వీటి ద్వారా 25వేల టన్నులకు పైగా చేపలు ఉత్పన్నమయ్యేది. వర్షాలు లేని కారణంగా చెరువుల్లో నీరు లేక ఆ ఉత్పత్తి కాస్త తగ్గుతుంది.

రొయ్యల్లో..


రొయ్యలు చిన్నవైనా బలవర్థకమైనవి. రుచికరమే గాకుండా ఆరోగ్యానిచ్చేవి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రొటీన్లు రొయ్యల ద్వారా పొందవచ్చు. కాల్షియం పాస్ఫరస్‌, ఐరన్‌, అయోడిన్‌, విటమిన్‌-బీ2, నికోటినిక్‌ ఆసిడ్‌ ఉంటాయి. రొయ్యలు తేలికగా జీర్ణమవుతాయి. రొయ్యల్లో 50-70 శాతం తేమ ప్రొటీన్లు, 67-80శాతం, 13.1-27.7కార్బోహైడ్రేడ్లు, కాల్షియం 470-535 మి.గ్రా, పాస్ఫరస్‌ 715-930, ఐరన్‌ 27.6-43.1 మి.గ్రా ఉంటాయి.

గుండెకు ఎంతో మేలు


చేపలు, రొయ్యలు మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచూ తీసుకోవటంతో శరీరంలో కొవ్వు తగ్గడంతోపాటు బీపీ, షుగర్‌ రాకుండా దోహదపడుతాయి. రక్తప్రసరణ సజావుగా సాగి గుండె పనిచేసే విధానం మెరుగుపడుతుంది. తద్వారా బీపీ దూరమవుతుంది. ఎసిడిటీ రాదు. పక్కటెముకలు గట్టిపడుతాయి. క్యాన్సర్‌ రాకుండా దోహదపడుతాయి.

నేత్రాలకు నేస్తాలు..


చేపలు, రొయ్యలు మన నేత్రాలకు నేస్తాల్లాంటివి. వీటి వల్ల మనిషికి ఏ, డీ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. కంటిలో రెటినాకు ముఖ్యకణాలైన ఫాంటోప్సిన్‌, సోటోప్సిన్‌ శక్తి పెరిగి కంటిచూపు బాగా కనిపిస్తుంది. ఇందులో వేడి పదార్థాలు ఉంటాయి. కాబట్టి జలుబు, ఆస్తమాను తగ్గించే శక్తి చేపలకు ఉంటుంది.

తెలంగాణ ప్రభుత్వంలో మత్స్యవిప్లవం..


తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మత్య్సవిప్లవం వచ్చింది. గ్రామ గ్రామన చెరుల్లో చేపల పెంపకానికి ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తుంది. అంతేకాకుండా మత్య్సకారుల జీవనోపాధి పెంచుతుంది. దీంతో రాబోయే రోజుల్లో చేపలు పుష్కలంగా లభించి ప్రజలు బలవర్థక ఆహారం లభించనుంది.

5544
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles