గర్జనపల్లి ఎంపీటీసీ ఏకగ్రీవం..

Wed,April 24, 2019 08:47 PM

first unanimously elected mptc in rajanna sircilla dist

నామినేషన్ దాఖలు చేసిన టీఆర్‌ఎస్ అభ్యర్థి ఇసంపల్లి హేమ
రాజన్న సిరిసిల్ల: జిల్లాలో ఏకగ్రీవాల పర్వం మొదలైంది. వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లి ఎంపీటీసీ స్థానం ఎస్సీ(మహిళ)కు కేటాయించారు. దీంతో ఆ గ్రామానికి చెందిన పలువురు ఎంపీటీసీ బరిలో నిలవడానికి సిద్ధపడ్డారు. దీంతో స్థానిక సర్పంచ్ గొర్రె కరుణ ఎంపీటీసీ ఏకగ్రీవంపై గ్రామస్తులతో చర్చించారు. అయితే.. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి గర్జనపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా ఇసంపల్లి హేమను ప్రకటించారు.

దీంతో పార్టీలకతీతంగా గ్రామస్తులంతా ఐక్యంగా ఉండి హేమకు మద్దతు తెలిపారు. గ్రామస్తులతో కలిసి హేమ ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఇసంపల్లి హేమ గతంలో రెండు పర్యాయాలు సర్పంచ్‌గా, ఒకసారి ఎంపీటీసీగా బరిలో దిగగా ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఒకే నామినేషన్ దాఖలవడంతో జిల్లాలోనే మొదటి ఏకగ్రీవ ఎంపీటీసీగా ఆమె నిలిచారు.

3323
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles