గౌరారం సర్పంచ్ ఎన్నిక గౌరవ ప్రదమే...

Sun,December 30, 2018 11:03 PM

first sarpanch in trs party will be unanimous in khammam district

ఖమ్మం: పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ సత్తా చాటాలని నూతనంగా బాధ్యతలు చేపట్టిన టీఆర్‌ఎస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల మేరకు పంచాయతీలు ఏకగ్రీవం చేసేందుకు టీఆర్‌ఎస్ నాయకులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాలం కలిసి వస్తే అన్ని అనుకూలమే అన్నట్లుగా పెనుబల్లి మండలంలో ఓ పంచాయతీ లాంఛనంగా ఎన్నిక కానుంది. ఎన్నికల ప్రక్రియ వెలువడటమే ఆలస్యం ఎన్నిక లాంఛనం కానుంది... అదే గౌరారం పంచాయతీ.

ఈ పంచాయతీలో మొత్తం 993 మంది ఓటర్లు ఉండగా వారిలో బీసీ 716, ఎస్సీ 226, ఇతరులు 48, ఎస్టీ 3 ఓట్లు మాత్రమే ఉన్నాయి. కాగా రిజర్వేషన్లలో పంచాయతీని ఎస్టీ మహిళకు కేటాయించారు. దీంతో పంచాయతీలోని మూడు ఎస్టీ ఓట్లే కీలకం. మూడు ఎస్టీ ఓట్ల వారు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం. ఆ ముగ్గురిలోనూ ఒకరు అంగన్‌వాడీ టీచర్, మరొకరు గ్రామ రెవెన్యూ అధికారులుగా పనిచేస్తున్నారు. మిగిలిన ఒక ఓటరు యువతి కాకా రుద్రజరాణి బీఈడీ చదువుతోంది.

ఆ యువతి కాకుండా గ్రామంలో మరొకరు లేరు. గౌరారంలో మొదటి నుంచి ఆ కుటుంబంలోని వ్యక్తులకే సర్పంచ్ పదవిని కేటాయించాలని మాజీ మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి అనుచరులు భావించడంతో పంచాయతీ ఎన్నిక లాంఛనంగా మాత్రమే మారింది. అంతే కాకుండా గ్రామంలోని 10 వార్డులలో మూడు జనరల్, ఎస్టీ, మరొక వార్డు ఎస్టీ మహిళలకు కేటాయించినప్పటికీ నాలుగు వార్డులకూ అభ్యర్థులు లేకపోవడం విశేషం.

2933
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles