కొనసాగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్

Mon,May 6, 2019 07:54 AM

first phase of mptc and zptc elections polling started in telangana

హైదరాబాద్: జిల్లా, మండల పరిషత్ తొలి విడుత ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకే రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం మూడు విడుతలుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో తొలి విడుతగా 197 మండలాల్లో పోలింగ్ జరుగుతోంది.

తొలి విడుతలో 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉండగా.. 69 ఎంపీటీసీలు, రెండు జెడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. దాంతో 2,097 ఎంపీటీసీలు, 195 జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది. ఎంపీటీసీ స్థానాలకు 7072 మంది, జెడ్పీటీసీ స్థానాలకు 882 మంది పోటీపడుతున్నారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మిగితా ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

పరిషత్ ఎన్నికల్లో ఓటేసేందుకు ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ బూత్‌లకు వెళ్తున్నారు. ఉదయం నుంచే ఓటేసేందుకు పోలింగ్ బూత్‌ల వద్ద క్యూలో నిలబడ్డారు.
1407
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles