తెలుగువర్సిటీ తొలి మహిళా రిజిస్ట్రార్‌గా అలేఖ్య

Sat,November 25, 2017 11:24 PM

first female Registrar of Telugu University

తెలుగుయూనివర్సిటీ: పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ తొలి మహిళా రిజిస్ట్రార్‌గా ప్రఖ్యాత అంతర్జాతీయ కూచిపూడి నర్తకీమణి ఆచార్య డాక్టర్ అలేఖ్య పుంజాల నియమితులయ్యారు. ఈ మేరకు వీసీ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రస్తుత రిజిస్ట్రార్ వడ్లకొండ సత్తిరెడ్డి అలేఖ్య పుంజాలకు బాధ్యతలు అప్పగించారు.

డిసెంబర్ 2వ తేదీకి 32 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న తెలుగువర్సిటీకి ఇప్పటివరకు 13 మంది రిజిస్ట్రార్లుగా పురుషులే పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఓ మహిళ రిజిస్ట్రార్ పదవిని చేపట్టడం విశేషం. మాజీ గవర్నర్ పీ శివశంకర్ కోడలు, ప్రముఖ వైద్యుడు వినయ్‌కుమార్ భార్య అయిన అలేఖ్య తెలుగువర్సిటీలో నృత్యశాఖ ఆచార్యులుగా 20 ఏండ్లుగా కొనసాగుతూ దేశ, విదేశాల్లో కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించి జాతీయస్థాయిలో అనేక పురస్కారాలను అందుకొని అంతర్జాతీయ కళాకారిణిగా పేరు గడించారు.

లలిత కళల పీఠం అధిపతిగా కొనసాగుతున్న అలేఖ్య రిజిస్ట్రార్‌గా నియామకం పట్ల భోదన, భోదనేతర, నాల్గో తరతి ఉద్యోగులు ఆమెకు అభినందనలు తెలిపారు. సత్తిరెడ్డి పూర్వశాఖ జర్నలిజం ఆచార్యులుగా కొనసాగుతారు.

1274
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles