బ్యాంకులో చెలరేగిన మంటలు..

Thu,August 22, 2019 05:22 PM

fires in the bank

మహబూబాబాద్: జిల్లాలోని దంతాలపల్లి గ్రామీణ వికాస బ్యాంకులో భారీగా మంటలు చెలరేగాయి. విషయాన్ని గమనించిన బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు బయటకు పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వివరాల్లోకి వెళ్తే.. బ్యాంకుకు సరఫరా అయ్యే విద్యుత్ వైర్లలో వర్షపు నీరు చేరడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. బ్యాంకంతా మంటలు, పొగతో నిండిపోవడంతో సిబ్బంది, మిగితా వారందరూ బయటకు పరుగులు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

676
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles