డీజిల్, గ్యాస్ సిలిండర్ల లారీ నుంచి ఎగసిపడ్డ మంటల వీడియోలు ఇవే!

Fri,January 12, 2018 09:16 PM

fire broke out in chengicherla x road near boduppal from diesel lorry videos

మేడ్చల్ : రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని చెంగిచర్ల చౌరస్తాలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడ నిలిపి ఉంచిన డీజిల్ ట్యాంకర్ నుంచి డీజిల్ తీస్తుండగా ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ల లారీకి మంటలు వ్యాపించాయి. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సిలిండర్లు పేలిపోవడంతో పెద్ద పెద్దగా శబ్దాలు వచ్చాయి. భారీ శబ్దాలకు స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశాయి. మంటలను ఆర్పేందుకు మూడు ఫైరింజన్లు శ్రమించాయి.

ఇక గ్యాస్ సిలిండర్ల లారీ పక్క నుంచి వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడికి మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ వాహనదారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ అగ్నిప్రమాదంలో పలు బైక్‌లు కాలిపోయాయి.


2891
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS