ఇంటర్ విద్యార్థులకు సన్నబియ్యం: ఈటల

Thu,January 5, 2017 12:15 PM

Fine Rice will be provide to the inter students

హైదరాబాద్: పాఠశాల విద్యార్థులతో పాటు ఇంటర్ చదివే విద్యార్థులకు సైతం సన్నబియ్యం పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రేషన్ బియ్యం కోసం ప్రభుత్వం రూ. 7 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 1.91 లక్షల మందికి కిలో బియ్యం రూ. 3కు అందిస్తుండగా తెలంగాణ ప్రభుత్వం రెండు కోట్ల మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున రూపాయికే కిలో బియ్యం అందిస్తున్నదని పేర్కొన్నారు.

812
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles