రేషన్ షాపు మూసివేస్తే జరిమానా

Mon,October 29, 2018 07:22 AM

fine imposed if ration shop is closed in working time

హైదరాబాద్: చాలా మంది లబ్ధిదారులకు రేషన్ డీలర్లు దుకాణం మూసివేస్తే ఏమి చేయాలో తెలియదు. అసలు డీలరు ఎటువంటి నియమాలు పాటించాలో సామాన్యునికి తెలిస్తే ఇబ్బందులు లేకుండా రేషన్ పొందవచ్చు. నిబంధనల ప్రకారం ప్రతీనెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చౌకధరల దుకాణాలు తెరిచి ఉండాల్సి ఉంటుంది. రేషన్ దుకా ణా లను ప్రతీరోజు ఉ. 6 గంటల నుంచి 12 గంటల వరకు సా. 4 నుంచి 8 గంటల వరకు తెరిచి ఉంచాల్సి ఉంటుంది. రేషన్ షాపు అను మతి లేకుండా మూసివేస్తే కూడా ఫైన్ విధిస్తారు. ఒక రోజు మూసి వేస్తే రూ. వెయ్యి, రెండ్రోజులు మాసివేస్తే రూ.1500, మూడ్రోజులు మూసివేస్తే రూ. 2 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 4 రోజులు మూసివేస్తే లైసె న్సు రద్దు చేసే అవకాశముంది. డీలర్లు దుకాణాలను మూసివేస్తే జిల్లా పౌరసరఫరా లశాఖ అధికారి లేదా మండల తహసీల్దారు, లేదంటే కలెక్టర్ లేదా పౌర సరఫరాలశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. తూనికలలో మోసం ఉన్నా..నిబంధనలు అతిక్రమించినా 1100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొ చ్చు. నిబంధనలు పాతవైనప్పటికీ చాలా మందికి తెలియని విషయమిది.

4818
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles