ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న షాపుల యజమానులకు జరిమానా

Thu,April 19, 2018 02:24 PM

Fine imposed for proprietors of shops who are using plastic covers in bansuwada

కామారెడ్డి: 40 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లను వాడకూడదని.. అవి పర్యావరణానికి హాని చేస్తాయని రాష్ట్ర ప్రభుత్వం వాటిని బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు.. వాటి బదులు సంచులు వాడాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ప్రచారం చేస్తున్నా షాపుల యజమానులు ఇంకా ఆ ప్లాస్టిక్ కవర్లనే వాడుతున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని బాన్సువాడలో 40 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లను వాడుతున్న వైన్స్, కిరాణా, చికెన్ సెంటర్ల యజమానులకు మున్సిపల్ కమిషనర్ జరిమానా విధించారు. ఇంకోసారి ప్లాస్టిక్ కవర్లను వాడకూడదంటూ హెచ్చరించారు.

1767
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles