'కాంగ్రెస్‌లో చేరి ఆర్థికంగా, భవిష్యత్ పరంగా నష్టపోయా'

Sat,March 16, 2019 05:34 PM

financially and Future Loss in Joining Congress says tpcc general secretary krishank

హైదరాబాద్: టీపీసీసీ జనరల్ సెక్రటరీ, అధికార ప్రతినిధి క్రిశాంక్ ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఆర్థికంగా, భవిష్యత్ పరంగా నష్టపోయినట్లు తెలిపారు. కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు వెల్లడించారు. రాహుల్‌గాంధీకి రాజీనామా లేఖను పంపించనున్నట్లు చెప్పారు. క్రిశాంక్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులు, యువతకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్నారు. నాకు 2014, 2018లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. టికెట్ ఇవ్వకుండా కుటుంబంలో చిచ్చుపెట్టిందన్నారు. పెద్దపల్లి ఎంపీ టికెట్ అడిగితే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నీ దగ్గర అంత డబ్బు లేదు కోట్లు ఖర్చు పెట్టుకోలేవు అన్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన వారికి, కేసులు ఉన్న వారికే టికెట్ ఇచ్చినట్లు తెలిపారు. కార్యకర్తల మనోభావాలు తెలుసుకోకుండా ఓడిపోయిన వాళ్లకు, ఓటుకు నోటు కేసులో ఉన్న వ్యక్తికి మల్కాజ్‌గిరి టికెట్ ఎలా ఇస్తారన్నారు. కొత్త వాళ్లకు ఎందుకు టికెట్ ఇవ్వరని ప్రశ్నించారు. కొందరు వ్యక్తుల చేతిలో కాంగ్రెస్ పార్టీ ఉందని అది ఇప్పడు కాంగ్రెస్ లిమిటెడ్ పార్టీ అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ విద్యార్థి నాయకులను ఎంపీలు, ఎమ్మెల్యేలను చేసిందని కొనియాడారు.

5494
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles