చెక్‌బుక్‌ను రద్దు చేయం: ఆర్థిక శాఖ

Fri,November 24, 2017 07:36 AM

finance ministry clarifies that checkbook facility do not closed

న్యూఢిల్లీ : చెక్‌బుక్‌ను రద్దుచేసే యోచనేదీ ప్రభుత్వం వద్ద లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు స్పష్టంచేశాయి. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా చెక్‌బుక్‌లను రద్దుచేయనున్నట్లు ఇటీవల మీడియాలో వార్తలు రావడంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ వివరణ ఇచ్చింది. ఇలాంటి ప్రతిపాదనేది ప్రభుత్వం వద్ద లేదని ట్విట్టర్ ద్వారా ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్రం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే.1814
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS