ఎంబీబీఎస్‌లో మిగిలిన సీట్లకు 29న కౌన్సెలింగ్

Tue,August 28, 2018 10:33 PM

final Counseling for in MBBS seats

వరంగల్ : తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలో మిగిలిన 9 ఎంబీబీఎస్ సీట్లను ఈ నెల 29న అడిషనల్ మాప్ అఫ్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్టు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ దేవులపల్లి ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈ నెల 29న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఇప్పటికే యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన అర్హులైన అభ్యర్థులు మొదటి నుంచి చివరి ర్యాంకు వరకు ఈ వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు www.knruhs.in అనే వెబ్‌సైట్‌లో చూడాలని తెలిపారు.

752
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles