ఏనుమాముల మార్కెట్‌లో సినిమా షూటింగ్

Thu,November 23, 2017 10:12 PM

Film shooting in the enumamula market

వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో అన్నదాత సుఖీభవ సినిమా షూటింగ్ జరిగింది. మార్కెట్‌లోని పత్తియార్డులో పలు సన్నివేశాలు చిత్రీకరించారు. పత్తి రైతులకు గిట్టుబాటు ధరలు లభించాలని, రైతుల కష్టసుఖాలు, మార్కెట్లో దళారుల దోపిడీలపై సుమారు మూడు గంటల పాటు షూటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పత్తి రైతులతో మాట్లాడి వారి సమస్యలను, గిట్టుబాటు ధరలు, పెట్టుబడులు, పంట చేతికి వచ్చిన వివరాలను తెలుసుకున్నారు. యార్డులో షూటింగ్ జరుగుతుందని విషయం తెలియడంతో కార్మికులు, స్థానికులు అధిక సంఖ్యలో తరలివచ్చి వీక్షించారు. ఈ సందర్భంగా సినిమా హీరో, నిర్మాత, కథ దర్శకుడు ఆర్ నారాయణమూర్తితో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. అనంతరం నారాయణమూర్తి మార్కెట్ కార్యదర్శి పోలెపాక నిర్మలను కలిసి మార్కెట్లోని విషయాలను అడిగితెలుసుకున్నారు.

2151
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS