రాకపోకలపై వాగ్వాదం : కర్రలతో దాడి

Sun,December 13, 2015 11:56 AM

fighting at Bandlaguda Rajiv Swagruha

హైదరాబాద్ : నాగోల్ బండ్లగూడలోని రాజీవ్ స్వగృహ వాసులపై దాడి జరిగింది. రాజీవ్ స్వగృహ ముందుగా వాహనాల రాకపోకలపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహానికి గురైన స్థానిక యువకులు రాజీవ్ స్వగృహ వాసులపై కర్రలతో దాడి చేశారు. కర్రల దాడిలో ఐదుగురు రాజీవ్ స్వగృహ వాసులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

1134
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles