11 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లపై వేటు

Mon,September 9, 2019 10:19 PM

Field assistants suspended in narayanapet


నారాయణపేట : నారాయణపేట జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీల 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన11 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు ఆదేశాలు జారీ చేశారు. 30 రోజుల ప్రణాళికకు సంబంధించి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు కాకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కలెక్టర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్నాసాగర్‌ గ్రామానికి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గోపాల్‌, మద్దెలబీడు బాలప్ప, సజనాపూర్‌ హన్మంతు, దేశాయపల్లి ఎల్లప్ప, కానుకుర్తి ఉషారాణి, ఉగ్మల్‌గిద్ద ప్రభావతి, వడెంపల్లి రమేశ్‌, మల్‌రెడ్డిపల్లి అన్నపూర్ణ, ఉల్లిగండం బాలప్ప, నర్సాపూర్‌ నారాయణ, మొగిలిమడక సాయప్పలను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ వెంకట్రావు హెచ్చరించారు.

851
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles