తండ్రి చేతిలో తనయుడి హతం

Sat,May 25, 2019 10:31 PM

father murdered his son in jagtial

గొల్లపల్లి : తండ్రి చేతిలో తనయుడు హతమైన ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేటలో జరిగింది. పోలీస్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లంబ లస్మయ్య తన కొడుకు మహేశ్ (25)ను తలపై సిమెంట్ ఇటుకతో మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం ఇంట్లో దేవుడికి పూజలు చేసుకున్న వారు శనివారం తిరుగువారం చేసుకున్నారు. మద్యం సేవించి ఉండడంతో కుటుంబసభ్యులు గొడవ పడ్డారు. మాటామాటా పెరిగి తండ్రీ కొడుకులు ఒకరినొకరు కొట్టుకున్నారు. గొడవలో లస్మయ్య సిమెంట్ ఇటుకతో మహేశ్ తలపై కొట్టడంతో అతడు మృతి చెందాడు. మహేశ్ ఏపనీ చేయకుండా జులాయిగా తిరిగే వాడనీ, ఇంట్లోవారితో తరచూ గొడవ పడుతుండేవాడనీ, సైకోలా ప్రవర్తించేవాడనీ, అతడి భార్యతో ఏడాది క్రితం విడాకులు తీసుకుందని గ్రామస్తులు తెలిపారు. ఘటనా స్థలాన్ని ధర్మపురి సీఐ లక్ష్మీ బాబు, గొల్లపల్లి ఎస్‌ఐ కిరణ్‌కుమార్ పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.

3339
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles