తండ్రి చేతిలో కొడుకు హతం

Sat,April 6, 2019 10:05 PM

father murder his son in yacharam rangareddy

యాచారం: కుటుంబ కలహాలు హత్యకు దారితీసిన సంఘటన మండలంలోని తక్కళ్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. దీనికి సంబందించి పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు...తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన కంబాలపల్లి బాలయ్య అతని కుమారుడు జంగయ్యకు గత కొంత కాలంగా కుటుంబ కలహాలతో తరుచూ తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం సైతం తగాదా తలెత్తడంతో ఇరువురి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో ఆవేశానికి గురైన బాలయ్య తన కుమారుడిని కర్రతో బలంగా బాదడంతో జంగయ్య(32) తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతనిని దవాఖానాకు తరలిస్తుండగా మార్గ మద్యలోనే మృతి చెందాడు. మృతుడికి బార్యా రజితతో పాటుగా కొడుకు, కూతురు ఉన్నారు. జంగయ్య మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోక సంద్రంలో మునిగారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

4040
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles