ఇద్దరు కుమార్తెలకు ఉరివేసి చంపిన తండ్రి

Fri,April 26, 2019 07:11 AM

father kills his own daughters and killed himself in siddipet dist

సిద్దిపేట: జిల్లాలోని దుబ్బాక మండలం లచ్చపేటలో దారుణం చోటు చేసుకున్నది. మద్యం మత్తులో ఓ తండ్రి అతికిరాతకంగా ప్రవర్తించాడు. తన ఇద్దరు కుమార్తెలకు ఉరివేసి చంపేశాడు. అనంతరం తను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత సంవత్సరమే అతడి భార్య మృతి చెందింది. ఈనేపథ్యంలో కూతుళ్లను చంపేసి.. తను ఆత్మహత్య చేసుకోవడం లచ్చపేటలో సంచలనం సృష్టించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే రాజు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. మృతులు బడుగు రాజేందర్(40), భవాని(9), లక్ష్మీ(5)గా పోలీసులు గుర్తించారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

3055
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles